వివాహ బంధంతో ఒక్కటైన ఐఏఎస్, ట్రైనీ ఐపీఎస్.. సింపుల్ గా రిజిస్ట్రార్ మ్యారేజ్
ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన యంగ్ ఐఏఎస్ ఆఫీసర్, ట్రైనీ ఐపీఎస్ లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట నిరాడంబరంగానే వివాహం చేసుకున్నారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్, ట్రైనీ ఐపీఎస్ దేవేంద్ర కుమార్ లు.. మచిలీ పట్నం కలెక్టరేట్ లోని ఛాంబర్ లో జిల్లా రిజిస్ట్రార్ సమక్షంలో ఎంతో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ దండలు మార్చుకుని రిజస్టర్ మ్యారేజ్ తో ఒక్కటయ్యారు. కొత్త జంటలకు కలెక్టర్ రాజా బాబా, కలెక్టరేట్ సిబ్బంది అభినందనలు తెలిపారు.