Konda Surekha : సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పిన కొండా సురేఖ !
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. తన కూతురు కొండా సుస్మిత చేసిన ఆరోపణలు, తన శాఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంపై ఆమె స్పందించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. తన కూతురు కొండా సుస్మిత చేసిన ఆరోపణలు, తన శాఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంపై ఆమె స్పందించారు.
తెలంగాణలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నిన్నమొన్నటివరకు ముఖ్యమంత్రితో విభేదిస్తూ వచ్చిన కొండా సురేఖ దంపతులు సోమవారం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ సమక్షంలో వారి భేటీ జరిగింది.
బీసీలను రెడ్లు తొక్కేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన సురేఖ.. నేడు సీఎం రేవంత్ ను ఆకాశానికి ఎత్తేశారు. బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని కొనియాడారు.
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ ఈ రోజు జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ విజయవంతమైంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కొండా సురేఖ తదితరులు బంద్ లో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడా రోడ్డు ఎక్కలేదు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఈ రోజు ఇచ్చిన బంద్‌లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. హైదరాబాద్ రేతిఫైల్ బస్టాండ్ సమీపంలో ఆందోళనలో పాల్గొన్నారు. బీజేపీ డ్రామా వల్ల బీసీల ఆశలన్నీ అడియాశలయ్యాయని ఆమె ఆరోపించారు.