Khammam Politics : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన మరో ఎమ్మెల్యే!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఈ రోజు సీఎం రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంకట్రావు, ఆయన అనుచరులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Nama Nageswara Rao : బీఆర్ఎస్కు షాక్.. బీజేపీలోకి మరో ఎంపీ?
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఎంపీ నామా నాగేశ్వర్రావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి కారు దిగి కాషాయ జెండా కప్పుకోనున్నారని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరందుకుంది.
Khammam: ఖమ్మంలో నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. సీపీ సీరియస్
రెండు గ్యాంగుల మధ్య జరిగిన కొట్లాట ఖమ్మం నగరాన్ని అతలాకుతలం చేసింది. మద్యం మత్తులో రేవతి, తెల్దారుపల్లి యూత్ గ్యాంగ్ ఒకరిపై ఒకరు కర్రలు, రాడ్లతో దాడి చేసుకున్నారు. అడ్డు వచ్చిన SI పై దాడి చేయగా.. ఆయనకు గాయాలు అయ్యాయి. దీనిపై సీపీ సునీల్‌దత్ సీరియస్ అయ్యారు.
Mallu Nandini: 500 కార్లతో గాంధీ భవన్ కు డిప్యూటీ సీఎం సతీమణి..!
ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నట్లు డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని ప్రకటించారు. నేడు దరఖాస్తు చేసేందుకు ఖమ్మం నుంచి 500 కార్లతో గాంధీ భవన్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఖమ్మం నుంచి సోనియా లేదా ప్రియాంక పోటీ చేసినా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
KTR: కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటే డేంజర్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే కాంగ్రెస్‌కు ప్రమాదం అని కేటీఆర్ అన్నారు. సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్ అని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని తెలిపారు.
Telangana: పార్టీ మారితే రోడ్ రోలర్‌తో తొక్కిస్తా.. రేణుకా చౌదరి మాస్ వార్నింగ్..
తెలంగాణలో అధికారం కాంగ్రెస్ పార్టీదే అని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి. ఎవరైనా కాంగ్రెస్ నుంచి ఫిరాయించాలని చూస్తే రోడ్ రోలర్‌తో వారి సంగతి చెబుతానని హెచ్చరించారు.
Khammam: ఖమ్మంలో అర్థరాత్రి ఉద్రిక్తత.. తుమ్మలతో ప్రాణాహాని ఉందంటున్న మాజీ పోలీస్ అధికారి..
ఖమ్మం పట్టణంలో అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. మాజీ పోలీస్ అధికారి బోస్ ఇంటి వద్దకు భారీగా తరలి వచ్చారు కాంగ్రెస్ శ్రేణులు. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావుతో తనకు ప్రాణహానీ ఉందని ఆరోపించారు బోస్. రౌడీలు తన ఇంటికి వచ్చారన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Ponguleti-Tellam-Venkat-rao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Nama-Nageswara-rao-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/KHAMMAM-GANG-WAR-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/nandini-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/KTR-COMMENTS-ON-KCR-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Renuka-Chowdary-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Khammam-Ex-Police-Officer-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Sambani-Chandra-Shekar-jpg.webp)