కవిత, కేటీఆర్ జైలుకే.. సుఖేష్ చంద్రశేఖర్ బహిరంగ లేఖ
మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ మనీలాండరింగ్ కేసులోని నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఎన్నికల్లో గెలిచి సీఎం అయినందుకు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం సుఖేష్ లేఖ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.