మాజీ సీఎంకు భారతరత్న.. జననాయక్ కర్పూరి ఠాకూర్‌కు అత్యున్నత పురస్కారం
బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. జననాయక్‌గా పేరున్న దివంగత కర్పూరి ఠాకూర్ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం విశేషంగా కృషిచేశారు. శత జయంతి సందర్భంగా ఆయనకు పురస్కారం అందిస్తూ కేంద్రం ప్రకటన చేసింది.