CAG Report On Telangana Revenue: తెలంగాణలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత లేదు.. కాగ్ నివేదిక
తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత కరువైందని కాగ్ నివేదిక పేర్కొంది. గత ప్రభుత్వం విద్య, వైద్యం మీద ఖర్చుల విషయంలో వెనుకంజలో ఉందని తెలిపింది. మొత్తం వ్యయంలో.. విద్య మీద 8 శాతం ఖర్చు చేయగా, వైద్యం కోసం 4 శాతం మాత్రమే ఖర్చు చేశారని తెలిపింది.