SON killed mother : ఉద్యోగం చేయాలని మందలించిన తల్లి... కొట్టి చంపిన కొడుకు
కాకినాడ జిల్లా ఎస్ అచ్యుతాపురంలో ఓ కొడుకు తల్లిని చంపేశాడు. ఉద్యోగం చేయాలని మందలించడమే ఆ తల్లి తప్పయింది. క్షణికావేశంలో తల్లిని నుదుటిపై గుద్దడంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది. ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు