TS: గురుకుల లెక్చరర్స్ నియామకాలపై హైకోర్టు కీలక తీర్పు!
తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్ లెక్సరర్ల భర్తీకీ సంబంధించిన ఇష్యూలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నోటిఫికేషన్ వివాదం కొనసాగుతుండగానే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడాన్ని తప్పుపట్టింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టాలని గురుకుల బోర్డుకు సూచించింది.