West Godavari: తణుకులో బంగారు నగల వ్యాపారి ఇంట్లో భారీ దోపిడీ
పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు పట్టణంలో బంగారు నగల వ్యాపారి ఇంట్లో భారీ దోపిడీ జరిగింది. బంగారు నగల వ్యాపారి కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేశారు దుండగులు. అంతేకాకుండా వారిని విచక్షణారహితంగా కొట్టారు. కేజీపైగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.