Bumrah: స్పిన్నర్ల గడ్డపై బుమ్రా వికెట్ల వరద.. ఈ లెక్కలు చూస్తే దిమ్మతిరగాల్సిందే భయ్యా!
సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన పేసర్ బుమ్రా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో దుమ్మురేపాడు. కెప్టెన్‌గానూ మంచి మార్కులు కొట్టేసిన బుమ్రా గురించి ఓ ఇంట్రెస్టింగ్ స్టాట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆసియా గడ్డపై తక్కువ వన్డే మ్యాచ్‌ల్లో ఎక్కువ వికెట్ల తీసిన ఆటగాడిగా బుమ్రా ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. అది కూడా అద్భుతమైన 4.65 ఎకానమీతో. మరికొద్ది రోజుల్లోనే ఆసియా కప్ స్టార్ట్ అవుతుండడంతో ఈ స్టాట్స్ టీమిండియా ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చింది.