ఫామ్ హౌస్ ఇష్యూ పై కేసీఆర్ సీరియస్
జన్వాడ ఫామ్ హౌస్ కేసుపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు. ఫాం హౌస్లో వేడుకలకు ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి ఈవెంట్ పర్మిషన్ తీసుకోలేదని.. అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ జరిగినట్లు అధికారులు గుర్తించారని అన్నారు.
ఫాంహౌస్ పార్టీపై కేటీఆర్ స్పందించారు. దీపావళికి ఇంట్లో దావత్ చేసుకుంటే తప్పా? అని ప్రశ్నించారు. అది ఫాంహౌస్ కాదని.. తన బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు అని అన్నారు. కానీ కొందరు దాన్ని రేవ్ పార్టీ అంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.