గుంటూరు Ambati rambabu: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కల్గించాలని చూస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరొపించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో తిరుగుతున్న నేతలు ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు అధికారం రాదేమో అనే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. By Karthik 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ పవన్ కళ్యాణ్ వీధి రౌడీలా మారిపోయాడు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వాలంటీర్లను అన్నా తమ్ముళ్లతో పోల్చిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వారిని దండుపాళ్యం బ్యాచ్ అనడం ఏంటన్నారు. విశాఖలో పవన్ హింస సృష్టించాలని చూస్తున్నారని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. By Karthik 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Varudu kalyani: పవన్‌కు రుషికొండపై పనేంటి.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌కు రుషికొండ మీద అంత ప్రేమ ఎందుకొచ్చిందో అర్థం కావడంలేదన్నారు. పవన్ విశాఖలో హింస సృష్టించాలని చూస్తున్నారన్న ఆమె.. అలా జరిగితే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. By Karthik 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: దండుపాళ్యం బ్యాచ్, వలంటీర్లకు తేడా లేదు: పవన్ కళ్యాణ్ దండు పాళ్యం బ్యాచ్ కు, వలంటీర్లకు తేడా లేదని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. శనివారం పెందుర్తి నియోజకవర్గంలో వలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వృద్ధురాలిని వలంటీర్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడని విచారం వ్యక్తం చేశారు.కేవలం బంగారు నగల కోసం కిరాతకంగా వ్యవహారించాడని అన్నారు. ఈ కేసులో వలంటీర్ చేసిన ఈ దురాగతాన్ని బయటపెట్టిన పోలీసులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు వైసీపీ నాయకులు ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని అన్నారు. వారు ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. చిన్నపాటి ఉద్యోగం కావాలన్నా, పాస్‌పోర్టు కావాలన్నా పోలీసు వెరిఫికేషన్ చేస్తారని.. వాలంటీర్ల నియామకంలో మాత్రం ఎలాంటి పోలీసు వెరిఫికేషన్ తీసుకోవడం లేదని అన్నారు. ఇదేమి విధానం అని పవన్ ప్రశ్నించారు. వ్యవస్థలను, శాంతి భద్రతలను కాపాడటం జనసేన బాధ్యత అన్నారు. By E. Chinni 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan Vizag Tour: షెడ్యూల్ ప్రకారం పెందుర్తికి పవన్ కళ్యాణ్.. బాధితురాలి కుటుంబ సభ్యులకు పరామర్శ జనసేన పార్టీ షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ విశాఖ పట్నంలోని పెందుర్తి నియోజక వర్గానికి వెళ్లనున్నారు. అక్కడ వలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్దురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. వారితో కొద్దిసేపు మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు పవన్ కళ్యాణ్. అలాగే అక్కడ చుట్టుపక్కల ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు విశాఖ నగరంలో సీఎన్‌బీసీ ల్యాండ్స్ ప్రాంతాన్ని పవన్ సందర్శించనున్నారు. By E. Chinni 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Varahi Yatra: సీఎం జగన్.. ఓ మూలన కూర్చోలేరా?: పవన్ Pawan Kalyan Varahi Yatra in Visakhapatnam: విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 'వారాహి విజయ యాత్ర' కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి విశాఖలో పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ పర్యటించనున్నారో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. నేటి నుంచి 17వ తేదీ వరకూ వైజాగ్ లో ఈ యాత్ర కొనసాతుందని వెల్లడించారు. శుక్రవారం విశాఖకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో మనోహర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగదాంబ కూడలిలో జరిగిన బహిరంగ సభ విజయవంతంపై ప్రతీఒక్కరినీ అభినందించారు. విశాఖ పరిధిలో పవన్ కళ్యాణ్ చేపట్టే కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని స్పష్టం చేశారు. ఆపై పవన్ పర్యటన షెడ్యూల్‌పై నేతలతో నాదెండ్ల చర్చించి ఖరారు చేశారు. By E. Chinni 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amarnath : అసూయ, ద్వేషాలతోనే పవన్ మాట్లాడుతున్నారు: మంత్రి అమర్నాథ్! పవన్ వ్యాఖ్యల పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దీని పై ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు.విశాఖ వేదికగా పవన్ అసూయతో అసత్యాలు మాట్లాడారు. పవన్ అనే అమాయకుడిని చూసి రాష్ట్ర ప్రజలు జాలిపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారాహి అనే లారీ మీద ఎక్కి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే విమర్శిస్తున్నాడు అంటే అతనికి ఎంతటి అసూయ ఉంతో తెలుస్తుందన్నారు. By Bhavana 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన.. పార్టీలో చేరిన మాజీ మంత్రి మాజీ మంత్రి పడాల అరుణ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పడాల అరుణ మెడలో జనసేన కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు పవన్. ఈ సందర్భంగా జనసేన చీఫ్ మాట్లాడుతూ.. పడాల అరుణ లాంటి సీనియర్ నేతలు జనసేనలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవలే తనను పడాల అరుణ కలిశారని పవన్ గుర్తు చేశారు. ప్రజల కోసం తాను పడుతున్న తపనను, పోరాటం పట్ల ఆకర్షితురాలినైనట్లు వెల్లడించారు. మీ పోరాటంలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నానని జనసేన పార్టీలో చేరతానన్నారని.. తాను స్వాగతించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. By E. Chinni 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఒంగోలు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ లు ఉత్సవ విగ్రహాలుగా మారారు! సర్పంచ్‌లకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడటంపై బీజేపీ మహాధర్నాకు దిగింది. తిరుపతిలో బీజేపీ మహాధర్నాలో జనసేన నేతలు పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత మొట్ట మొదటిసారి బీజేపీతో కలిసి నిరసనలో జనసేన పాల్గొంంది. By Bhavana 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn