ISRO: అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్, ప్రయోగం వాయిదా.. ఇస్రో కీలక ప్రకటన
సోమవారం రాత్రికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టబోయే స్పేడెక్స్ ప్రయోగం వాయిదా పడింది. తాజాగా దీనిపై ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమ్నాథ్ స్పందించారు. అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ జరగడం వల్లే రెండు నిమిషాలు ఆలస్యంగా రీషెడ్యూల్ చేశామని చెప్పారు.