Israel-Hamas war: మీరు ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఉగ్రవాదుల వివరాలు చెప్పండి.. గాజా ప్రజలకు ఇజ్రాయెల్ ఆఫర్..
గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న భీకర ప్రతిదాడిలో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గాజాలో ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా, ప్రశాంతంగా ఉండాలంటే హమాస్ ఉగ్రవాదుల ఆచూకి వివరాలు తమతో పంచుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఉగ్రవాదుల ఉనికిని చెప్పిన వారి వివరాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు చెప్పమని హామీ ఇచ్చింది. అలాగే సమాచారం చెప్పిన వారికి ప్రైజ్‌మనీని కూడా అందిస్తామని తెలిపింది.