MLC Kavita: ఈడీ కోర్టుకు వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్న కవిత
ఢిల్లీ మద్యం స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు పంపించింది. దాని ప్రకారం ఆమె ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ విషయం తేలేవరకూ ఈడీ విచారణకు హాజరు కాకూడదని కవిత నిర్ణయించుకున్నారు.