Bhadradri Kothagudem District: వైద్యుల నిర్లక్ష్యానికి బలైన పసికందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో పుట్టిన కొన్ని గంటలకే పసికందు మృతి చెందింది. దీంతో గర్భిణీ బంధువులు ఆందోళనకు దిగారు. చిన్నారి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన ఆస్పత్రి సూపరిండెట్ పసికందు మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.