Indra : తగ్గని మెగాస్టార్ క్రేజ్.. ఇంద్ర రీరిలీజ్ కు ఆర్టీసీ స్పెషల్ బస్సులు!
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేకి రీ రిలీజ్ అయిన 'ఇంద్ర' మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో ఓ ఊపు ఊపుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ట్వీట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ కు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇంద్ర మూవీని చూసేందుకు వెళ్లే వారి కోసం స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.