World Cup: వరల్డ్‌కప్ ను పెద్దగా పట్టించుకోని జనాలు..కారణం ఇదేనా?
వన్డే క్రికెట్ వరల్డ్‌కప్‌కు క్రేజీ తగ్గిందా? ఇంతకు ముందు ఉన్నంత హడావుడి ఇప్పుడు లేదా? క్రికెట్ నుచూసే జనాలు తక్కువ అవుతున్నారా...లేక వన్డే ఫ్మార్మాట్ ను చూడ్డానికి ఇష్టపడ్డం లేదా. ప్రస్తుం భారత్‌లో వన్డే ప్రపంచకప్ టోర్నీ జరుగుతోంది. మామూలుగా వరల్డ్‌కప్ అంటే ఎక్కడ లేని మోజు ఉంటుంది. అందులోనూ క్రికెట్ ను మతంగా భావించే ఇండియాలో అయితే మరీను. కానీ ఈ సారి పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంది. ఎక్కడా అసలు హడావుడే లేదు. మొన్న జరిగిన భారత్, పాక్ మ్యాచ్‌కి కూడా జనాలు అస్సలు స్పందించలేదు. కోట్లమంది జనాభా ఉన్న దేశంలో వ్యూస్ కేవలం లక్షల్లో ఉంది అంటేనే అర్ధమవుతుంది వరల్డ్‌కప్ ఎంత చప్పగా సాగుతోందో.