Latest News In Telugu Ind vs Pak: ఈ టీమిండియా మొనగాడు వస్తున్నాడు.. ఇక ప్రత్యర్థులకు చుక్కలే..! డెంగీ బారిన పడ్డ టీమిండియా యువ సంచలనం శుభమన్ గిల్ చెన్నై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే ప్రస్తుతం అతని ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉందని తెలుస్తోంది. భారత్ జట్టుతో పాటు హోటల్లోనే గిల్ ఉన్నట్టు సమాచారం. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో గిల్ ఉన్నట్టు తెలుస్తోంది. రేపు(అక్టోబర్ 11) అప్ఘాన్‌తో మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండడంలేదు. అటు అక్టోబర్ 14న పాక్‌తో జరిగే మ్యాచ్‌లో గిల్ ఆడడంపైనా సందేహాలు రేకెత్తుతున్నాయి. By Trinath 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs PAK: మాయదారి దోమ.. పాక్ మ్యాచ్‌కి టీమిండియా తురుము దూరం..! ప్చ్.. ఇలా జరిగిందేంటి? వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత శుక్రవారం డెంగీ పరీక్షల్లో యువ ఓపెనర్ గిల్‌కు డెంగీ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం చెన్నైలో చికిత్స పొందుతున్న గిల్ భారత్‌తో కలిసి ప్రయాణించడంలేదని బీసీసీఐ సెక్రటరీ జయ్షా ప్రకటించారు. అక్టోబర్ 11న అఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌తో పాటు అక్టోబర్ 14న పాక్‌తో మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు. By Trinath 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India VS Pakistan : అహ్మదాబాద్ లో జరిగే భారత్- పాక్ మ్యాచ్ కోసం.. వందే భారత్ రైళ్లు..! అహ్మదాబాద్ లో వన్డే ప్రపంచకప్(World Cup) లో భాగంగా, జరగబోతున్న ఇండియా VS పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు వెళ్లే వారి కోసం భారతీయ రైల్వే శాఖ(Indian Railway) మ్యాచ్ జరిగే రోజున వివిధ ప్రాంతాల నుంచి వందే భారత్ (Vande Bharat Trains) ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. By Archana 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World cup 2023: క్రికెట్ అభిమానుల కష్టాలు.. VPN ఆన్ చేసుకోవాల్సి వస్తోంది భయ్యా! ఈ నెల 14న ఇండియా వర్సెస్ పాక్ ప్రపంచ కప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో పాక్ క్రికెట్ లవర్స్‌కి వీసా కష్టాలు ఎక్కువయ్యాయి. భారత ప్రభుత్వ వెబ్ సైట్లను యాక్సెస్ చేయడంపై పాక్ గతంలో ఆంక్షలు విధించింది. దీంతో హైకమిషన్ వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు తలెత్తడంతో వీపీఎన్‌ను ఉపయోగించుకోవాల్సి వస్తోంది. By Trinath 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs PAK: అల్లుడు రాక్...మామ షాక్..!! ఆసియా కప్ 2023లో పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ బ్యాట్ల నుంచి అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ కనిపించింది. వీరిద్దరి సెంచరీతో పాక్‌పై భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. By Bhoomi 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind vs Pak: నువ్వు దేవుడు సామీ.. ఇరగదీశాడుగా.. పాక్ టార్గెట్ ఎంతంటే? ఆసియా కప్‌లో భాగంగా పల్లెకెలే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ చేసింది. 48.5 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. పాండ్యా, ఇషాన్ కిషన్ సూపర్ ఆటతో టీమిండియా ఈ మాత్రం స్కోర్ చేయగలిగింది. ఏదో చేస్తారని ఆశించిన రోహిత్, కోహ్లీ తీవ్రంగా నిరాశ పరిచారు. అటు పాక్ పేసర్ షాహీన్ ఆఫ్రిది నాలుగు వికెట్లతో నిప్పులు చెరిగాడు. By Trinath 02 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ గ్రౌండ్లో అలా..బయట ఇలా..రవూఫ్‌ను చూసి కోహ్లీ ఏం చేశాడో తెలుసా..? నేడు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీని చూసిన రవూఫ్...దగ్గరకు వచ్చి విరాట్ ను కౌగిలించుకున్నాడు. కోహ్లీ కూడా చిరునవ్వు చిందిస్తూ పలకరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Bhoomi 02 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Asia cup: క్రికెట్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. రేపటి ఇండియా-పాక్ మ్యాచ్ డౌటేనా? రేపు(సెప్టెంబర్ 2న) శ్రీలంకలోని పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. వెదర్ రిపోర్ట్స్ ప్రకారం మ్యాచ్‌కు ముందు 68శాతం రెయిన్ పడే అవకాశం ఉంది. ఎంతో హైప్ ఉన్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండడంతో ఫ్యాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. By Trinath 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ World cup: 'బుక్ మై షో' వాడి అడ్రెస్ చెప్పండి భయ్యా.. ఇదెక్కడి వెయిటింగ్ టైమ్ బాబోయ్! ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన భారత్-పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడుపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తున్న 'బుక్ మై షో'పై సోషల్‌మీడియా వేదికగా అసహనాన్ని వెళ్లగక్కారు. టికెట్ బుకింగ్ సమయంలో సైట్ క్రాష్ అవ్వడం.. వర్చువల్ క్యూలైన్లలో గంటల కొద్ది నిరీక్షించాల్సి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. By Trinath 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn