IND vs PAK: రోహిత్ శర్మ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో మ్యాచ్ స్వరూపమే మరిపోయింది భయ్యా..నువ్వు కేక బ్రో!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన కెప్టెన్సీ ఎలాంటిదో ప్రపంచానికి చూపించాడు. పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను తన తెలివితేటలతో కట్టడి చేశాడు. 29ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి ఉన్న పాక్ ఒక దశలో 300 రన్స్ చేసేలా కనిపించింది. అయితే సరిగ్గా అదే సమయంలో ఊహించని విధంగా బుమ్రాను రంగంలోకి దింపిన రోహిత్ సక్సెస్ అయ్యాడు. అప్పటికీ క్రీజులో పాతుకుపోయిన రిజ్వాన్‌ని అవుట్ చేశాడు. దీని తర్వాత మ్యాచ్ మలుపు తిరిగి పాక్ 192 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.