IND vs AUS: సమరానికి సై..భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా..నెగ్గేదెవరు..తగ్గేదెవరు..!!
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టీమిండియా 5సార్లు చాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఢీ కొట్టబోతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు అంటే ఆదివారం ఆస్ట్రేలియాతో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి శుభారంభం చేయాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది.