World Cup 2023: టీమిండియాకు బిగ్ షాక్.. తర్వాతి రెండు మ్యాచ్‌లకు స్టార్ ప్లేయర్ దూరం!
వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో ఇరగదీస్తున్న టీమిండియాకు బ్యాడ్ న్యూస్ ఇది. అక్టోబర్ 29న ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు స్టార్ ఆల్‌రౌండర్ పాండ్యా అందుబాటులో ఉండడంలేదు. బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో పాండ్యా గాయపడ్డ సంగతి తెలిసిందే. అతను గ్రౌండ్లో దిగడానికి మరింత సమయం పడుతుందని సమాచారం.