Rohit Sharma: కోహ్లీ వల్ల కూడా కాలేదు.. రోహిత్ రికార్డులు అలా ఉంటాయి మరి!
వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించడంతో మరో రికార్డు వచ్చి పడింది. వరల్డ్‌కప్‌లో అత్యధిక సార్లు 50+ స్కోర్ చేసిన ప్లేయర్లలో రోహిత్ సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. 23 ఇన్నింగ్స్‌లలో రోహిత్ 12సార్లు 50+ స్కోరు చేశాడు. సచిన్ 44 ఇన్నింగ్స్‌లో 21 సార్లు 50+ రన్స్ చేశాడు.
BAN vs NED: వరల్డ్‌కప్‌లో మరో సంచలనం.. నెదర్లాండ్స్ దెబ్బకు టైగర్స్ ఢమాల్!
క్రికెట్ వరల్డ్‌కప్‌లో మరో సంచలనం నమోదైంది. పసికూన నెదర్లాండ్స్ బంగ్లా టైగర్స్‌ను ఓడించింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే దక్షిణాఫ్రికాకు షాక్ ఇచ్చిన డచ్ టీమ్ ఇప్పుడు బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. 230 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 142 రన్స్ కు ఆలౌట్ అయ్యింది.
World Cup 2023: 'బుద్ధి ఉన్నొడు ఎవడైనా అతనికి బౌలింగ్ ఇస్తాడా'? పాకిస్థాన్ మాజీల తిట్ల దండకం!
ఉసామా మీర్ అద్భుతంగా బౌలింగ్ చేసిన మ్యాచ్‌లో అతడిని కాదని నవాజ్‌కు బౌలింగ్ ఇచ్చిన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌పై విరుచుకుపడ్డాడు ఆ జట్టు లెజెండరీ ప్లేయర్ వసీం అక్రమ్. పాక్‌పై దక్షిణాఫ్రికా ఒక వికెట్ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఓవర్ నవాజ్‌కు ఇవ్వడం బాబర్ చేసిన అతి పెద్ద పొరపాటుగా వసీం మండిపడ్డాడు.
World cup 2023: పేరుకేమో తోపు, తురుము.. ఇప్పుడేమో ఆటలో అరటిపండు!
ఆస్ట్రేలియా బౌలింగ్ పెద్ద దిక్కు మిచెల్ స్టార్క్‌కు ప్రస్తుతం ఏదీ కలిసిరావడం లేదు. వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ వికెట్ తీసిన రికార్డు కలిగి ఉన్న స్టార్క్.. న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో వికెట్ తియ్యలేకపోయాడు. అంతేకాదు వరల్డ్‌కప్ చరిత్రలో ఆస్ట్రేలియా నుంచి అత్యంత చెత్త గణాంకాలను నమోదు చేశాడు. 9 ఓవర్లలో 89 పరుగులు ఇచ్చి వరస్ట్ రికార్డును మూటగట్టుకున్నాడు.
AUS vs NZ: ఆస్ట్రేలియా గెలవడానికి అసలు కారణం ఇదే.. ఎవరైనా అడిగితే ఈ ప్రూఫ్స్ చూపించండి!
ఆస్ట్రేలియా ఫీల్డర్ల పోరాటమే ఆ జట్టును గెలిపించింది. చివరి ఓవర్లో అద్భుతమైన ఫీల్డింగ్‌తో జట్టుకు నాలుగు పరుగులు సేవ్ చేశారు మ్యాక్స్ వెల్, లబూషెన్. కివీస్ కేవలం గెలుపునకు 5 పరుగుల దూరంలోనే నిలిచింది. ఒకవేళ ఆస్ట్రేలియా ఫీల్డర్ల విన్యాసాలే లేకుంటే మ్యాచ్ రిజల్ట్ మరోలా ఉండేది.
AUS vs NZ: మ్యాచ్ అంటే ఇది.. నరాలు తెగిపోయాయి భయ్యా..! అయ్యో బ్లాక్ క్యాప్స్..
మరో హై థ్రిల్లర్ మ్యాచ్‌కు ధర్మశాల వేదికైంది. లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో చివరకు ఆస్ట్రేలియా గెలిచింది. 389 పరుగులు లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ చివరి బంతికి బోల్తా పడింది. 50 ఓవర్లలో 9 వికెట్లకు 383 పరుగులు చేసిన కివీస్ ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్, కివీస్ బ్యాటర్ రచిన్ సెంచరీలు చేశారు.
IND vs ENG: ఇంగ్లండ్‌ను ముప్పుతిప్పలు పెట్టేందుకు రెడీ అయిన మ్యాచ్ విన్నర్... పాపం బట్లర్!
లక్నో వేదికగా ఇంగ్లండ్‌పై రేపు(అక్టోబర్ 29) జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా అశ్విన్‌ని ఆడించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే లక్నో పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుంది. జడేజా, కులదీప్‌తో పాటు అశ్విన్ కూడా జట్టులో ఉంటే స్పిన్ ఆడడంలో వీక్ అయిన ఇంగ్లండ్ బ్యాటర్లను ఈజీగా బోల్తా కొట్టించవచ్చని రోహిత్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.
AUS Vs NZ: కివీస్‌కు 'హెడ్'నొప్పి.. కుమ్మేసిన కమ్మిన్స్.. బాదిపడేశారుగా!
బ్యాటింగ్‌లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. న్యూజిలాండ్‌పై జరుగుతున్న పోరులో ఆసీస్ 49.2 ఓవర్లలో 388 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో హెడ్ 67 బంతుల్లో 107 రన్స్ చేస్తే.. వార్నర్ 65 బాల్స్‌లో 81 రన్స్ చేశాడు. చివరిలో కమ్మిన్స్ కివీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 14 బంతుల్లోనే 37 రన్స్ చేయడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది.