Bumrah: బుమ్రాతో పోలికా? సొంత జట్టు ఫ్యాన్స్‌కు ఇచ్చిపడేసిన పాకిస్థాన్ లెజెండ్!
ప్రస్తుత పేసర్లలో టీమిండియా స్టార్ బుమ్రాను మించిన మరో బౌలర్ లేరన్నాడు వసీం అక్రమ్. పాక్ పేసర్ షాహీన్ అఫ్రిదితో బుమ్రాను పోల్చడం అనవసరం అని కుండబద్దలు కొట్టాడు. కొత్త బంతితో బుమ్రా తనకంటే బెటర్‌గా బౌలింగ్ చేస్తాడంటూ టీమిండియా యార్కర్ కింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు ఈ పాక్ లెజెండ్.