రేవంత్ సర్కార్ కొత్త చట్టం |Anti Land Grabbing Act | RTV
రేవంత్ సర్కార్ కొత్త చట్టం |Telangana Congress Government Proposes to Introduce Anti Land Grabbing Act to bring transparency in the Land Titling| RTV
రేవంత్ సర్కార్ కొత్త చట్టం |Telangana Congress Government Proposes to Introduce Anti Land Grabbing Act to bring transparency in the Land Titling| RTV
హైదరాబాద్ లో హైడ్రా మెరుపు వేగంతో పనిచేస్తోంది. జోరువానలోనూ హైడ్రా చీఫ్ రంగనాధ్ ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు అధికారులు. మాదాపూర్ ఈదులకుంట చెరువు రెవెన్యూ రికార్డుల నుంచి ఈ చెరువు మాయం అయిపోయిందంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ చెరువును పరిశీలించారు రంగనాధ్.
కేసీఆర్ మిత్రుడికి చెందిన జన్వాడ ఫామ్ హౌస్ లో ఇరిగేషన్ అధికారులు కొలతలు వేస్తున్నారు. దీంతో ఈ ఫామ్ హౌస్ కూల్చివేతకు ఏర్పాట్లు సాగుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. హైకోర్టు సైతం ఈ ఫామ్ హౌస్ కూల్చివేతపై స్టే ఇవ్వకపోవడంతో అధికారులు యాక్షన్ లోకి దిగినట్లు తెలుస్తోంది.
“బఫర్ జోన్ లో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. అందుకే ఎన్ కన్వెన్షన్ కూల్చేశాము. పేద, మధ్యతరగతికి చెందిన కట్టడాలపై ఇప్పుడు చర్యలు తీసుకోవడం లేదు. అటువంటి నిర్మాణాలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది.” అంటూ హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు.
హైడ్రా ఆధ్వర్యంలో చెరువులు, కుంటలను ఆక్రమించి కట్టిన కట్టడాలు అవి బడాబాబులు.. సెలబ్రిటీలు ఎవరికి చెందినవైనా సరే కూల్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాధ్ కు ముప్పు ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే, ఆయన ఇంటి వద్ద పోలీసు భద్రత పెంచింది.
ఈ రోజు రాయదుర్గంలో అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. నోటీసులు ఇవ్వకుండా 40 ఏళ్లుగా ఉంటున్న తమ ఇళ్లను ఎలా కూల్చివేస్తారంటూ స్థానికులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
కావాలంటే తనను కాల్చి చంపాలని, లేకుంటే నరికి చంపండని అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. తమను ఏం చేసినా పర్వాలేదు కానీ.. పేదల కోసం నిర్మించిన ఫాతిమా కాలేజీని మాత్రం కూల్చొద్దన్నారు. కొందరు కావాలనీ ఈ కాలేజీ భవనాలను తప్పుగా చూపిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.