రాజకీయాలు Telangana: ప్రవళిక ఆత్మహత్య కేసులో సంచలన ట్విస్ట్.. కీలక వ్యాఖ్యలు చేసిన తల్లి.. చిక్కడపల్లి ప్రవళిక ఆత్మహత్యపై ఆమె తల్లి, సోదరుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'వాడే నా బిడ్డను టార్చర్ చేశాడు.' అంటూ ప్రవళిక తల్లి సంచలన ఆరోపణలు చేశారు. 'నా కొడుకు, కుమార్తె రెండేళ్లుగా హైదరాబాద్లో ఉంటున్నారు. కూలీ పనులు చేసుకోవద్దని కష్టపడి కోచింగ్ ఇప్పించాం. కానీ ప్రవళికను శివరామ్ ప్రేమ పేరుతో వేధించాడు. నా బిడ్డను శివరామ్ టార్చర్ చేశాడు. ఈ విషయం చెప్పలేక ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. వాడిని కఠినంగా శిక్షించాలి.' అని డిమాండ్ చేశారు. By Shiva.K 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telanagana: సాయి బాబా మందిరంపై 53 ఓట్లు.. ఇంతకీ ఎవరివీ.. 18 ఏళ్లు నిండిన పౌరులకు ఓటు వేసే హక్కు ఉంటుంది. కానీ హైదరాబాద్లోని మియాపూర్లో ఉన్న సాయిబాబా ఆలయానికి కూడా ఓటు హక్కు ఉంది. ఈ ఆలయం పేరు మీద ఏకంగా 53 ఓట్లు ఉన్నాయి. అదేంటీ బాబా మందిరానికి ఓట్లు ఉండటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా. తాజాగా ఎలక్షన్ కమిటీ కేటాయించిన జాబితాలో కూడా ఈ ఓట్లు ఉన్నాయి. అయితే ఆ ఓట్లు ఎవరివి.. నిజమైనవేనా లేకా బోగస్ ఓట్లా అనే సందేహం వస్తుంది కదా. అయితే ఈ మందిరం గురించి పూర్తిగా తెలుసుకోండి. By B Aravind 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ప్రవళిక మృతి ఘటనలో నిర్లక్ష్యం.. చిక్కడపల్లి సీఐపై సస్పెన్షన్ వేటు.. ప్రవళిక విషాదాంతం నేపథ్యంలో చిక్కడపల్లి సీఐ నరేష్ ను సస్పెండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేసారు. వరంగల్ కు చెందిన ప్రవళిక 15 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి అశోక్ నగర్లోని బృందావన్ హాస్టల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం ప్రవళిక హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. By Shiva.K 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Balakrishna: బాలయ్య ఎక్కడ? ఏపీలో కనిపించకపోవడానికి కారణమదేనా? చంద్రబాబు అరెస్టు తరువాత బాలకృష్ణ చాలా ఎగ్రసీవ్ గా టిడిపి వ్యవహారాలు చూసుకున్నారు. బాలయ్యతో పాటు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా రాజమండ్రిలో ఉంటూ పార్టీ ఆదేశానుసారం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే మొదట్లో చాలా హడావిడి చేసిన బాలకృష్ణ.. ఇప్పుడు ఎందుకు ఏపీకి రావడం లేదని చర్చ మొదలైంది. ఒకవైపు బ్రాహ్మణి, భువనేశ్వరి రాజమండ్రి లోనే ఉంటూ టిడిపిని యాక్టివ్ చేసే పనిలో ఉన్నారు. కానీ బాలకృష్ణ మాత్రం హైదరాబాద్ వెళ్లిపోవడంపై ఆ పార్టీ నేతలే పెదవిరుస్తున్నారు. By Shiva.K 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీఆర్ఎస్పై బీజేపీ పంజా.. రేపు హైదరాబాద్లో ఐటీ దాడులు జరిగే ఛాన్స్..! తెలంగాణకు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. యుద్ధం వాతావరణం నెలకొంది. అప్పుడే ప్రధాన పార్టీలు తమ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) రాకతో రాష్ట్రంలో పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయింది. రెండు సభల్లో ప్రధాని ప్రసంగం ఒక ఎత్తైతే.. గురువారం జరుగబోయే సీన్ మరో ఎత్తు ఉండబోతుందని తెలుస్తోంది. అవును, బీఆర్ఎస్ టార్గెట్గా ఐటీ దాడులు జరిగే అవకాశం కనిపిస్తోంది. గురువారం ఉదయం నుంచే హైదరాబాద్లో బీఆర్ఎస్ మద్దతుదారులపై ఐటీ దాడులు జరిగే అవకాశం కనిపిస్తోంది. By Shiva.K 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganesh Immersion: గణనాథుడి నిమజ్జనానికి సర్వం సిద్ధం.. హుస్సేన్ సాగర్లో ఏర్పాట్లు ఇవే.. భాద్రపద శుద్ధ చవితి రోజున భూలోకానికి విచ్చేసి.. తిమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకుని, వారు అర్పించిన నైవేద్యాలను ఆరగించిన గణపయ్య.. కైలాసానికి తిరుగుపయనమయ్యేందుకు సిద్ధమయ్యాడు. గురువారం నాడు బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడికి చేరనున్నాడు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో గణనాథుల విగ్రహాల నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. By Shiva.K 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: భూవివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై కేసు నమోదు.. హైదరాబాద్లోని కోకాపేటలో ఓ భూ వివాదానికి సంబంధించి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డిలపై నార్సింగి పోలీస్ ఠాణాలో కేసు నమోదైంది. వీరిద్దరితోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. By Shiva.K 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn