Crime News: హైదరాబాద్‌లో దారుణం.పెళ్లైన నెలకే భార్యను చంపి..భర్త ఏం చేశాడంటే?
హైదరాబాద్ చంపాపేటలో దారుణం జరిగింది. పెళ్లైన నెల రోజులకే భార్యను అతి కిరాతకంగా చంపాడు ఓ భర్త. స్వప్నను కత్తితో దారుణంగా హత్యచేశాడు. భార్యను చంపిన ఆనంతరం తాను బిల్డింగ్ పై నుంచి దూకాడు. ఈ సంఘటనతో చంపాపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రస్తుతం భర్త ప్రేమ్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Husband killed his Wife with Knife: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం.. భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడులో దారుణం చోటు చుకుంది. జిల్లాలోని ఆకివీడుకు చెందిన సంధ్య రాణి, రాంబాబు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది అయితే వీరి మధ్య గత కొంత కాలంగా విభేదాలు తలెత్తాయి. దీంతో కోర్టుకు వెళ్లి వీరు విడాకులు కూడా తీసుకున్నారు. భర్త రాంబాబును వదిలేసి సంధ్య రాణి తల్లితండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలోనే శనివారం గుడికి వెళ్లి వస్తోన్న భార్య సంధ్యను వెనుక నుండి వచ్చిన భర్త రాంబాబు చాకుతో పీకపై కోశాడు. ఆ తర్వాత రెండు మూడు సార్లు సంధ్య రాణిపై దాడి చేశాడు. ఈ ఘటనలో సంధ్య రాణి రోడ్డుపైనే మృతి చెందింది. భార్యను హత్య చేసిన అనంతరం రాంబాబు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/knife-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/police-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/crime-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/5-46-jpg.webp)