Airlines : ఫ్రాన్స్ లో చిక్కుకున్న భారతీయుల విమానానికి లైన్ క్లియర్..నేడు భారత్ కు!
హ్యుమాన్ ట్రాఫికింగ్ జరుగుతుందన్న అనుమానంతో 303 మంది భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దాని మీద విచారణ జరిపిన అధికారులు విమానం బయల్దేరేందుకు అనుమతులిచ్చారు. దీంతో విమానం సోమవారం భారత్ కి రానుంది.