Vishal: ఆ సంస్ధకు అప్పు చెల్లించని హీరో విశాల్..!!
నటుడు విశాల్‌పై లైకా సంస్థ వేసిన కేసులో మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. హీరో విశాల్ దాదాపు రూ.23 కోట్ల వరకు లైకా నిర్మాణ సంస్థకు అప్పు చెల్లించాల్సి వుంది. అయితే, విశాల్ బ్యాంకు అకౌంట్లో డబ్బులున్నప్పటికీ తమకు చెల్లించడం లేదంటూ లైకా సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తమకు చెల్లించాల్సిన నగదులో సగమైనా డిపాజిట్ చేయాలని విశాల్‌ను ఆదేశించాలని కోరారు. అయితే, ఇందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, కానీ అందుకు లైకా సంస్థ చర్చలకు రావడం లేదని విశాల్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో నవంబరు 1కి విచారణను వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.