Arakuloya: గిరిజనుల పాలిటి వరం "జగనన్న ఆరోగ్య సురక్ష: ఆరోగ్య మంత్రి విడుదల రజిని
జగనన్న ఆరోగ్య సురక్ష పథకం గిరిజన ప్రాంతాల ప్రజల పాలిటి ఒక వరప్రదాయాని కాబోతున్నదని ఆంధ్రప్రదేశ్ వైద్యరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని ఈరోజు అరకు లోయలో అన్నారు. గత నెల 30న ప్రారంభించిన కొత్త పథకం తీరుతెన్నులు పరిశీలించేందుకు ఆమె రెండు రోజులగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు.