Israel:హమాస్ దగ్గర రసాయన ఆయుధాలున్నాయి-ఇజ్రాయెల్ అధ్యక్షుడు
ఇజ్రాయెల్ మీద రసాయన ఆయుధాల దాడులకు హమాస్ సిద్ధంగా ఉందంటూ ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రసాయన ఆయుధాలను ఎలా తయారు చేయాలో వివరించే పూర్తి సమాచారం హమాస్ మిలిటెంట్ల వద్ద ఉందన్నారు. తమ సైన్యం దాడుల్లో మృతి చెందిన ఓ హమాస్ సాయుధుడి వద్ద రసాయన ఆయుధాలకు సంబంధించిన ఆధారాలు లభించాయని చెప్పారు.