TS: రైతులను మోసం చేస్తే కఠిన చర్యలుంటాయి.. సీఎం రేవంత్ వార్నింగ్!
రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. తాగునీటిపై కూడా సమీక్షలు నిర్వహించాలన్నారు.