BIS App: ఇంట్లోనే బంగారం క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు.. ఈ యాప్ మీ ఫోన్లో ఉంటే చాలు!
ప్రపంచం డిజిటల్ మయం అయ్యాక అంతా మారిపోయింది. అన్నీ మన చేతుల్లోకే వచ్చేశాయి. దేనికీ కష్టపడక్కర్లేకుండా పనులు ఈజీగా అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి బంగారు ఆభరణాలు కూడా వచ్చేశాయి. బంగారం స్వచ్ఛత తెలుసుకోవాలంటే ఇప్పుడు ఎక్కడికీ పరుగెట్టక్కర్లేదు అంటోంది భారత ప్రభుత్వం. మీ ఇంట్లోనే యాప్ ద్వారా దాన్ని చెక్ చేసుకోవచ్చని చెబుతోంది.