Minister KTR: గజ్వేల్లో ఈటల పోటీపై స్పందించిన మంత్రి కేటీఆర్.. ఇంట్రస్టింగ్ కామెంట్స్..
హుజూరాబాద్, గజ్వేల్ రెండు స్థానాల్లోనూ తాను పోటీ చేయబోతున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ‘బీజేపీకి పోటీ చేసే అభ్యర్థులు లేరేమో. ఈటల రాజేందర్ గజ్వేల్ లోనే కాదు.. ఇంకా 50 చోట్ల పోటీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆయన పోటీ చేస్తున్న రెండు చోటా మేమే గెలుస్తాం’ అని వ్యాఖ్యానించారు.