TDP-Janasena-BJP: అనపర్తి టీడీపీకే..రఘురామకు క్లీయరైన లైన్!
అనపర్తి అసెంబ్లీ సీటును టీడీపీకి ఇచ్చేసేందుకు బీజేపీ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె సీటును బీజేపీ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అనపర్తి అసెంబ్లీ సీటును టీడీపీకి ఇచ్చేసేందుకు బీజేపీ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె సీటును బీజేపీ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తూర్పుగోదావరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతుంది. గోపాలపురం మండలం రగపాడు గ్రామంలో పెద్దపులి సంచరిస్తోంది. అడవిపందిని చంపేసింది. ఉదయాన్నే పశువులకు మేత వేయడానికి వెళ్లిన రైతులు ఈ ఘటనను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
మనుషులు రోజురోజుకూ దిగజారిపోతున్నారు. ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. అనుమానం వస్తే చాలు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో భార్యకు శిరోముండనం చేసి..చిత్ర హింసలు పెట్టిన సంఘటన ఆందోళన కలిగిస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తృటి లో ప్రమాదం తప్పింది. బాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో ఒక్కసారిగా స్టేజీ మీదకు వచ్చేసిన టీడీపీ నేతలు. దీంతో అక్కడ కొద్దిగా తోపులాట చోటు చేసుకుంది.ఈ క్రమంలో చంద్రబాబు నాయుడిని టీడీపీ నేతలు తోసేశారు. దీంతో చంద్రబాబు నాయుడు తుళ్లి పడబోయారు.
చనిపోయాడనుకుని కర్మకాండలకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేశారు కుటుంబ సభ్యులు. పోలీసుల వద్ద నుంచి మృతదేహాన్ని తీసుకోవడమే తరువాయి. ఇంతలో నేను బతికే ఉన్నాను అంటూ చనిపోయాడు అనుకుంటున్న వ్యక్తి వద్ద నుంచి ఫోన్ వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు షాక్ అయ్యారు.
చచ్చేంత వరకు సీఎం జగన్ తోనే ఉంటానని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 175 సీట్లు గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కి కూడా వాటా ఉందని ఆరోపించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిసే విశ్వరూప్ తనయుడు పినిపే శ్రీకాంత్ కు చేదు అనుభవం ఎదురైంది. అమలాపురం రూరల్ మండలం కామనగరువు విత్తనాల వారి కాలవగట్టు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి తనయుడు పినిపే శ్రీకాంత్ పాల్గొన్నారు. మంత్రి విశ్వరూప్ కుమారుడిపై తిరగబడ్డారు అమలాపురం కేసుల్లో ఉన్న స్థానికులు. మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ పై దాడికి యత్నించారు. మీ తండ్రి మాపై అక్రమంగా కేసులు పెట్టించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు మా గ్రామానికి రావాల్సిన అవసరం ఏంటి? అని స్థానికులు విశ్వరూప్ పై విరుచుకు పడ్డారు. తండ్రి అక్రమంగా కేసులు పెట్టించి అరెస్టు చేయించారు.. అధికారం ఉంది కదా అని అమాయకులను ఇరికిస్తే చూస్తూ ఊరుకోమంటూ స్థానిక మహిళలు, యువత శ్రీకాంత్ పై ఆగ్రహంతో ఊగిపోయారు.
నడిరోడ్డుపై పాము, ముంగీస పోట్లాడుకున్న ఈ వీడియో తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలోని రహదారిపై జరిగింది. దాదాపు అరగంట సేపు ప్రధాన రహదారిపై తాచుపాము, ముంగీసలు కొట్టుకున్నాయి. ముంగిస దానితో పోరాటానికి ప్రయత్నించగా.. బుసలు కొడుతూ దానిని కాటు వేయడానికి తాచుపాము యత్నించింది. ఇది దూరంగా గమనించిన స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురై అరగంట పాటు అటు దిశగా వెళ్లలేదు. కాసేపు
పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పరిధిలోని కొత్తగా ఏ ఒక్క కట్టడం కూడా జగన్ రెడ్డి చేపట్టలేదని, ఇంకా 214 కట్టడాలు కట్టాల్సి ఉందని చెప్పారు. అలాగే 50 శాతం కనెక్టివిటీ పనులు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. పురుషోత్తం పట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ను పారిశ్రామిక, తాగు నీటి అవసరాలకు విశాఖ నగరానికి సుమారు 23 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని నిర్ణయిస్తే వైసీపీ ఆటకెక్కించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖుడి దగ్గర అధికారం ఉంటే, రాష్ట్రానికి ఎంత నష్టమో పోలవరం ఓ ఉదాహరణ..