Double Decker Corridor: రూ.1,580 కోట్లతో నిర్మాణం.. హైదరాబాద్ తొలి 'డబుల్ డెక్కర్ కారిడార్'కు నేడు రేవంత్ శంకుస్థాపన!
హైదరాబాద్‌లో తొలి డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఇవాళ శంకుస్థాపన జరగనుంది. రూ.1,580 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తారు. 5.320 కిమీ మేర కారిడార్ నిర్మాణానికి సీఎం కండ్లకోయ జంక్షన్ సమీపంలో శంకుస్థాపన చేస్తారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పై తర్వాత మెట్రో మార్గం నిర్మిస్తారు.