గోమూత్ర కాదు.. అవి గోముద్రకు సంకేతం : డీఎంకే ఎంపీ వ్యాఖ్యలపై గవర్నర్ తమిళి సై
గోమూత్ర రాష్ట్రాలైన ఉత్తరాది రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందంటూ డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ తెలంగాణ గవర్నర్ తమిళి సై తనదైన శైలిలో స్పందించారు. గోమూత్ర కాదు, గోముద్రకు ఆ రాష్ట్రాలు సంకేతాలని ఆమె వ్యాఖ్యానించారు.