దీపావళికి కొత్త రెవెన్యూ చట్టం.. ప్రభుత్వానికి చేరిన దస్త్రం
తెలంగాణలో కొత్త రెవిన్యూ చట్టం అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. పట్టాదారు పాస్‌పుస్తకాలు, యాజమాన్య హక్కుల చట్టం-2020 స్థానంలో ఆర్వోఆర్ 2024ను దీపావళి నుంచి అమల్లోకి తీసుకురానుంది. ప్రతిగ్రామంలో ఒక భూ రక్షకుడిని నియమించనుంది.