ఢిల్లీ సర్వీస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. ఎన్డీఏ కూటమికి 131ఓట్లు
సుదీర్ఘ చర్చ తర్వాత ఢిల్లీ సర్వీసెస్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. ఓటింగ్ సందర్భంగా బిల్లుకు మద్దతుగా 131 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 102 ఓట్లు పోలయ్యాయి. ఢిల్లీ సేవల బిల్లు ఏ విధంగానూ సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించదంటూ కామెంట్స్ చేశారు అమిత్షా. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు దేశ రాజధానిలో సమర్థవంతమైన, అవినీతి రహిత పాలన లక్ష్యంగా రూపొందించన్నారు. INDIA కూటమిలో మరిన్ని పార్టీలు చేరినా పర్వాలేదని 2024లో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు అమిత్షా