Andhra Pradesh: రేపు చంద్రబాబుతో పురంధేశ్వరి ములాఖత్.. తోడుగా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా..!
చంద్రబాబు అరెస్ట్‌పై ఇంతకాలం స్తబ్ధుగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి.. ఇప్పుడిప్పుడే ఆయన అరెస్ట్‌పై స్పందిస్తున్నారు. రాజమండ్రికి వెళ్లి.. అక్కడ చంద్రబాబుతో ములాఖత్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం నాడు నారా భువనేశ్వరి, బ్రాహ్మణనితో కలిసి.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అవుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం.