WPL 2024 : ఇది కదా క్రికెట్ మజా..ఉత్కంఠపోరులో ఢిల్లీపై ముంబై విజయం..!!
డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో తొలి విజయం నమోదు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి పోరులో హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆఖరి బంతికి విజయం సాధించింది.