KTR: ఇప్పుడున్న సీఎం దొంగ.. రేవంత్ పై కేటీఆర్ ఫైర్
ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తే ఓటు కు నోటు లో దొరికిన దొంగ అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయనే ఓ క్రిమినల్.. ఆయనకు ఉండేవే క్రిమినల్ ఆలోచనలు అని అన్నారు.
ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తే ఓటు కు నోటు లో దొరికిన దొంగ అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయనే ఓ క్రిమినల్.. ఆయనకు ఉండేవే క్రిమినల్ ఆలోచనలు అని అన్నారు.
ఈమధ్య ప్రధాని మోడీ కాంగ్రెస్ లోని గాంధీయేతర నేతలపై ప్రశంసల వర్షం కురిపిస్తూ వస్తున్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న కూడా ప్రకటించారు. అసలు మోడీ వ్యూహం ఏమిటి? కాంగ్రెస్ స్వయంకృతాపరాధాన్ని ప్రధాని ఎలా అనుకూలంగా మార్చుకుంటున్నారు.. ఈ స్పెషల్ స్టోరీ చదవండి
ప్రభుత్వ బ్యాంకులు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ఆరోపణలు చేశారు.కోల్సా స్కామ్, 2 జీ వంటి స్కామ్లలో దేశం కూరుకుపోయిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ వీల్ చైర్ లో వచ్చి ఓటు వేశారు. ఒక ఎంపీ తన బాధ్యతల పట్ల ఎంత అప్రమత్తంగా ఉంటారో చెప్పేందుకు ఇదో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ' అని మోడీ అన్నారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలవొద్దని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్కు ఓటేసినా, బీఆర్ఎస్కు ఓటేసినా ఒకటే అని అన్నారు. ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు పంపారు. పార్టీలో ఉద్యమకారుడికి రక్షణ కరువైందని సంచలన ఆరోపణలు చేశారు.
యూపీఏ సంకీర్ణ హయాంలో ఆర్థిక అవకతవకలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో శ్వేతపత్రం సమర్పించారు. ఈ శ్వేతపత్రం భారతదేశ ఆర్థిక దుస్థితి, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రతికూల ప్రభావాలను, ఆర్థిక దుర్వినియోగం గురించి వివరిస్తుంది.
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని ఇండియా టుడే 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే అంచనా వేసింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే 10 స్థానాలు కాంగ్రెస్, మూడు స్థానాలు బీఆర్ఎస్, మూడు స్థానాలు బీజేపీ, ఒక స్థానం ఎంఐఎం పార్టీలు కైవసం చేసుకుంటాయని అంచనా వేసింది.
ప్రధాని మోడీ ఓబీసీకేటగిరీలో పుట్టలేదని రాహుల్ గాంధీ అన్నారు. అతను గుజరాత్లోని తెలి కులంలో జన్మించాడు. ఈ కమ్యూనిటీకి 2000 సంవత్సరంలో బీజేపీ ఓబీసీ ట్యాగ్ ఇచ్చింది. అతను సాధారణ కులంలో జన్మించాడు.అందుకే కుల గణన అంటే మోడీ ఒప్పుకోరని రాహుల్ విమర్శించారు.