బిజినెస్ CM Revanth: దావోస్‌కు సీఎం రేవంత్.. మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక సూచనలు! సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు దావోస్‌లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్‌కు హాజరుకానున్నారు. 6 గ్యారెంటీల అమలు, ఎంపీ ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు రేవంత్. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: పెన్షన్ల ఊసే లేదు.. కాంగ్రెస్‌పై కవిత గరం! తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెన్షన్ల ఊసే ఎత్తడం లేదని చురకలు అంటించారు ఎమ్మెల్సీ కవిత. జనవరి ఒకటో తేది నుంచి రూ.4వేలు ఇస్తా అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dharani Poratal: ధరణిపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు ధరణి పోర్టల్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి అధ్యయనానికి ఐదుగురితో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ధరణి పోర్టల్ పునర్నిర్మాణంపై ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. ధరణి కమిటీ కన్వీనర్‌గా సీసీఎల్ఏ వ్యవహరించనుంది. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medigadda: మేడిగడ్డపై విచారణ.. హైకోర్టు సీజేకు తెలంగాణ ప్రభుత్వం లేఖ తెలంగాణ హైకోర్టు సీజేకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. మేడిగడ్డపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్డిని కేటాయించాలని రేవంత్ సర్కార్ లేఖలో కోరింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎంకు ఆహ్వానం సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి కొండ సురేఖ, ఐనవోలు మల్లిఖార్జున స్వామి ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఈ రోజు సచివాలయంలో కలిశారు. ఈ నెల 13 నుంచి ప్రారంభమయ్యే స్వామి వారి బ్రహ్మోత్సవాలకు (జాతరకు) రావాలని ఆహ్వానించారు. అర్చకులు సీఎంకు ఆశీర్వచనాలు అందించారు. By Nikhil 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth Reddy: నిబంధనలు సడలించి చనిపోయిన కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం.. మానవతా దృక్పథం చాటిన సీఎం రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి మారోసారి మానవతా దృక్పథాన్ని చాటారు. చనిపోయిన కానిస్టేబుల్ భార్యకు నిబంధనలు సడలించి ఉద్యోగం లభించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెండేళ్లుగా స్థానికత కారణంగా ఉద్యోగం దక్కక బాధపడుతున్న ఆ మహిళకు ఈ రోజు రాచకొండ సీపీ నియామక పత్రం అందించారు. By Nikhil 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు దీపాదాస్ మున్షీని కలిసిన పొన్నం ప్రభాకర్ గాంధీభవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వీరి మధ్య చర్చ జరిగింది. By Nikhil 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy: రేవంత్ రెడ్డిపై మండలి చైర్మన్ కు ఫిర్యాదు ఓ ఇంటర్వ్యూలో శాసనమండలిని ఇరానీ కేఫ్ గా, సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, ప్రభాకర్, సురభి వాణి దేవి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. రేవంత్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. By Nikhil 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revant Reddy: సీతక్క ఇలాకా ములుగులో కంపెనీ.. రేవంత్ రెడ్డి కీలక సమీక్ష! ములుగు జిల్లా కమలాపురంలోని బల్లార్ పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మిల్లును పునరుద్ధరించేందుకు ఉన్న అవకాశాల గురించి పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2014లో ఈ మిల్లు మూతపడింది. దీంతో దాదాపు 750 కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. By Bhoomi 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn