Minister KTR: సిరిసిల్ల పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతోంది
సిరిసిల్ల పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. అక్కడ ప్రభుత్వం ఇటీవల నిర్మించిన మెడికల్ కాలేజీని ప్రారంభించారు.
సిరిసిల్ల పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. అక్కడ ప్రభుత్వం ఇటీవల నిర్మించిన మెడికల్ కాలేజీని ప్రారంభించారు.
ఇది ఖమ్మం జిల్లా.. దొరల జిల్లా కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని వెంకటాపురంలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇది ఖమ్మం జిల్లా అని, ప్రజల జిల్లా అని భట్టి స్పష్టం చేశారు. దొరల జిల్లా కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్ల ఇంద్రసేనారెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు పరేడ్ గ్రౌండ్లో సీబ్ల్యూసీ సమావేశం నిర్వహించుకోవడం కోసం కేంద్రాన్ని కోరినట్లు, దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొతర లేకుండా చూడాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొరత లేకుండా చూసేందుకు సీనియర్ అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఆయన అన్నారు.
తెలంగాణ మహిళకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కేంద్రాలు ఏర్పాటు చేసింది. తాజాగా మరో 100 మహిళా కేంద్రాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాకతీయ యూనివర్సిటీ వీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్డీ అడ్మిషన్ విషయంలో మెరిట్‌పై మాట్లాడటానికి వెళ్లిన విద్యార్థి నేతలపై పోలీసులు దాడి చేయడం ఎంటన్నారు. వర్సిటీ వీసీ విద్యార్థులను కొట్టించారని ఈటల రాజేందర్ ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు వెన్ను పోటు పొడుస్తోందన్నారు. రైతుకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు రైతులను నిండా ముంచిందని అన్నారు.
సీఎం కేసీఆర్ తన మనసు మార్చుకున్నారా? ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేయడం లేదా? ఒక చోట నుంచి తాను పోటీ చేసి.. మరో చోట నుంచి బీఫామ్ ఆ నేతకు ఇస్తున్నారా? ఆసక్తి రేపుతున్న సీఎం కేసీఆర్ లోచనలు.
జై కేసీఆర్..సీఎం కేసీఆర్ రావాలి... కేసీఆర్ కావాలి’, దేశ్ కీ నేత కేసీఆర్’ అనే నినాదాలతో పెళ్లి మండపం దద్దరిల్లింది. సీఎం కేసీఆర్ ప్రముఖుల పెళ్లి ఫంక్షన్స్‌కు వెళ్లడం కొత్త విషయం కాదు. కానీ, హైదరాబాద్‌లో జరిగిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడి వివాహానికి వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జై కేసీఆర్..సీఎం కేసీఆర్ అంటూ యువకుల కేరింతలతో పెళ్లి మండపం మారుమోగింది.