ఉగాది తర్వాత టీడీపీ కనుచూపు మేరలో కనిపించదు...మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు... !
జీపీఎస్ పై ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ చర్చలు ముగిశాయి. చర్చలు సుహృద్బావ వాతావరణంలో జరిగాయని మంత్రి బొత్స సత్యానారాయణ వెల్లడించారు. మరికొన్ని అంశాలను చేర్చాలని ఉద్యోగ సంఘాలు అడిగాయన్నారు. అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పామని వెల్లడించారు. చంద్రబాబు ఢిల్లీ తిరుగుతున్నాడని అన్నారు. బీజేపీ గేట్లు తెరిస్తే దూరాలని చూస్తున్నాడన్నారు.