Cricket News: ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో సచిన్ ఫ్రెండ్ ఘన విజయం!
ఐసీఏ(ICA) ఎన్నికల్లో మాజీ ఆటగాడు చాముండేశ్వర నాథ్ సత్తా చాటాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్‌కి ఐసీఏ రిప్రజెంటీవ్ నామినీ కోసం జరిగిన ఎన్నికల్లో ఆయన 89 ఓట్ల తేడాతో విజయం సాధించారు. హర్విందర్ సింగ్‌పై గెలవడంతో ఐసీఏ రిప్రజెంటీవ్ నామినీగా చాముండేశ్వర నాథ్ ఎన్నికైనట్లు ఐసీఏ ఎలక్టోరల్ ఆఫీసర్ ఏకే జోటి ప్రకటించారు.