కెనడాలో మరో ఆలయాన్ని ధ్వంసం చేసిన ఖలీస్తాన్ మద్దతుదారులు..!
కెనడాలో మరో హిందూ ఆలయంపై దాడి జరిగింది. బ్రిటీష్ కొలంబియాలోని సర్రే టౌన్ లోని ప్రముఖ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాన్ని ఖలిస్తాన్ మద్దతుదారులు కూల్చి వేశారు. ఇక కెనడాలో ఆలయంపై దాడి జరగడం ఇది నాలగవ సారి. ఈ ఏడాది ఏప్రిల్ లో ఒంటారియాలోని స్వామి నారాయణ్ ఆలయంపై దాడి జరిగింది. అంతకు ముందు ఫిబ్రవరిలో కెనడాలోని రామ మందిర్, జనవరిలో బ్రాంప్టన్ ఆలయంపై ఖలీస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేశారు.