🔴LIVE : 5నిమిషాల్లో 25 వార్తలు | Konda Surekha| Samantha | Pawan kalyan | AP TS Sports NEWS | RTV
China Mobiles: మన దేశంలో చైనా మొబైల్స్ హవా.. ఆ బ్రాండ్స్ కే ఎక్కువ డిమాండ్!
మన దేశంలో చైనా కంపెనీల మొబైల్స్ ఆదరణ పెరిగింది. నాలుగు చైనీస్ బ్రాండ్లు Xiaomi, Realme, Vivo, Oppo భారత్ మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. టాప్ బ్రాండ్స్ లో మొదటి నాలుగు స్థానాలు వీటివే. ఐదో ప్లేస్ లో దక్షిణ కొరియాకు చెందిన Samsung ఉంది
ఆగస్ట్1 నుంచి అమలులో BIS ప్రమాణాలు!
ఆగస్టు 1 నుంచి బీఐఎస్ నూతన నాణ్యతా ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. దీంతో పాదరక్షలను అధిక నగదులో వినియోగదారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇటీవలె పాదరక్షల తయారీదారులు IS 6721, IS 10702 మార్గదర్శకాలను అనుసరించాలని బీఐఎస్ నిబంధనలు జారీ చేసింది.
PM Kisan: రైతులకు భారీగా నిధుల కేటాయింపు.. పీఎం కిసాన్ భారీగా పెంపు?
దేశ వార్షిక 2024-25 బడ్జెట్ లో వ్యవసాయం, సంబంధిత రంగాలకు రూ.1.52 లక్షల కోట్లను నిర్మలమ్మ కేటాయించారు. ఇది గత బడ్జెట్ రూ.1.25 లక్షల కోట్ల కంటే రూ.25 వేల కోట్లు ఎక్కువ. అయితే కనీస మద్దతు (MSP) గురించి ఎటువంటి ప్రకటన నిర్మలమ్మ చేయలేదు.
Ten Rupees Coin: ఆర్బీఐ చెప్పినా వినరా? పదిరూపాయలు నాణేల విషయంలో వ్యాపారుల అతి!
పది రూపాయల నాణేలు చెల్లవని వ్యాపారులు చెబుతూ వస్తున్నారు. పది రూపాయల కాయిన్స్ విషయంలో ఆర్బీఐ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా వ్యాపారులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పది రూపాయల నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని ఆర్బీఐ చెబుతోంది.
Ambani: నగదు నిల్వ కంపెనీలలో అంబానీనే టాప్!
భారత అగ్రసంస్థల్లో ఒకటైన రిలయన్స్ సంస్థ నగదు నిల్వ చేసే కంపెనీలలో రూ.2.08 లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉన్నట్టు బ్లూమ్ బర్గ్ నివేదిక తెలిపింది. ఆ తర్వాత రెండో స్థానంలో టాటా గ్రూప్ కు చెందిన టాటా మోటర్స్ 60వేల కోట్లతో ఉన్నట్లు నివేదికలో పేర్కొంది.
Koo APP: మూతపడనున్న సోషల్ నెట్వర్కింగ్ సైట్ కూ..!
ఆర్థిక సంక్షోభం కారణంగా భారత సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'గో' మూసివేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు అబ్రమయ్య రాధాకృష్ణ ప్రకటించారు.ఆర్థిక సంక్షోభం కారణంగా ఇక్కడ పనిచేసే ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోవటంతో దీనిని నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు.