రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది..
రాష్ట్రంలో పుంగనూరు రాజకీయ వేడి కొనసాగతూనే ఉంది. తాజాగా దీనిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న స్పందించారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. పోలీసుల వల్లే పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొందన్నారు. రోడ్డుకు లారీని అడ్డుగా పెట్టిన వారిపై పోలీసులు కేసులు ఎందుకు పెట్టలేదన్నారు. లారీని తీయడానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జి చేశారని మండిపడ్డారు.