నీతిఆయోగ్ మెచ్చిన తెలంగాణ వైద్యశాఖ: మంత్రి హరీశ్ రావు!
తెలంగాణ రాక ముందు వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు అంటే జనాలు భయపడి పోయేవారు. అంతకు ముందు 30 శాతం డెలివరీలు మాత్రమే అయ్యేవి. కానీ ఇప్పుడు 70 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
కాళేశ్వరం ఇంజనీర్ కేసీఆరే.. కేసీఆర్ రాత్రి పూట డిజైన్ చేసి చెక్ డ్యాంలకు ప్లాన్ గీశారు: భట్టి విక్రమార్క
సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రైతులు వరదల వల్ల సర్వం కోల్పోయి నడి రోడ్డున పడితే.. కేసీఆర్ మాత్రం వారి మంత్రులతో బీసీ బంధు చెక్కులను పంపిణీ చేయించుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.
కేసీఆర్..! నీ అబ్బ జాగీరు కాదు: ఈటల
సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాంజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసైన్డ్ భూముల్లో వ్యవసాయం చేసుకుటున్న దళితులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. గత ప్రభుత్వం బడంగ్‌పేటలో దళితులకు 42 ఎకరాలు కేటాయిస్తే కేసీఆర్ దానిని దోచుకోవడం ప్రారంభించారని ఆరోపించారు
బీఎస్ రావు సంతాప సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత
శ్రీ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకుడు బీఎస్ రావు సంతాప సభ ఆదివారం రంగారెడ్డి జిల్లా నార్సింగిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్టొన్నారు. బీఎస్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు
నేను ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తను.. నా జీవితం కాంగ్రెస్‌కే అంకితం
తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై MP ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. తనపై కొందరు కాంగ్రెస్ నాయకులే తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని బాంబు పేల్చారు. వారికి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు తనను టార్గెట్ చేస్తున్నాయన్నారు. తాను 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్లు వెల్లడించారు. తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు
కేసీఆర్.! ఆ విషయం మర్చిపోయారా..? ప్రశ్నించిన పొంగులేటి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం బాధితులకు పలు సూచనలు చేసిన ఎంపీ.. సీఎం కేసీఆర్ అజాగ్రత్త వల్లే ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయన్నారు. గతంలో వరద బాధితులకు ప్రకటించిన పరిహారం ఏమైందని మాజీ ఎంపీ ప్రశ్నించారు.
ఇప్పటికిప్పుడు లోకసభ ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారో తెలుసా? తేల్చేసిన సర్వేలు..!!
ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా లోకసభ ఎన్నికలు జరిగితే...మోదీ హవా కొనసాగుతుందని పలు సర్వేలు తేల్చి చెప్పాయి. ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విపక్ష కూటమి ఇండియా కంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భారీ ఆధిక్యం సాధిస్తుందని వెల్లడయ్యింది.
ప్రభుత్వ అసమర్థత వల్లే అనేక మంది మరణించారు
సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్గ్ర ప్రభుత్వ అసమర్థత వల్లే అనేక మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ముంపు ప్రాంత వాసులకు వరదలు వస్తున్నట్లు ముందే సమాచారం ఇస్తే ప్రాణనష్టం జరిగేది కాదన్నారు. వరదల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలను, ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు